3 ఏళ్లలో 1472 కోట్ల అభివృద్ధి

25-11-2026 | 06:11pm

ప్రగతి నివేదిక విడుదల చేసిన కడియం శ్రీహరి

జనగామ, నవంబర్ 25 (విజయక్రాంతి): ఎమ్మెల్యేగా 3 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1472 కోట్ల అభివృద్ధి పనుల ప్రగతి నివేదికను కడియం శ్రీహరి(MLA Kadiyam Srihari) విడుదల చేశారు. నివేదికలోని ఏ అంశం తప్పని నిరూపించినా దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం, కృష్ణా నీటి వాటాలపై బీఆర్ఎస్ నేతలను నిలదీశారు. కష్టపడే కార్యకర్తలకు తప్పక అవకాశాలు వస్తాయన్నారు.

ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ ఓట్ల చోరీ నుంచి విరాళాల చోరీ వరకు మోదీ పాలనలో అన్నీ వివాదాలేనని, బీజేపీకి బీఆర్ఎస్ సరెండర్ అయిందని విమర్శించారు. 2029లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, కూడా చైర్మన్ గుండు సుధారాణి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రో పాషా, ఏఐసీసీ పరిశీలకులు కేబీఆర్ నాయుడు, వరంగల్ పార్లమెంట్ ఇంచార్జ్ దుద్దిల్ల శ్రీను బాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, లకావత్ ధన్వంతి, జంగా రాఘవరెడ్డి, మారుజోడు రాంబాబు తదితరులతో పాటు మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు