టీపీసీసీ చీఫ్‌తో డాక్టర్ మట్టా దయానంద్ భేటీ

25-11-2026 | 06:40pm

సత్తుపల్లి, నవంబర్ 25 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నార్సింగిలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, రానున్న రోజుల్లో చేపట్టనున్న రాజకీయ, సంస్థాగత కార్యక్రమాలపై (Political Activities) సుదీర్ఘంగా చర్చించారు.

నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని సమష్టిగా పనిచేస్తూ క్షేత్రస్థాయిలో (Ground Level) పార్టీని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మినేని ప్రసాదరావు, దొడ్డ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు