ఎల్ఓసీ అందజేత

16-09-2026 | 04:20pm

జనగామ,(విజయక్రాంతి): జనగామ మండల(Jangaon Mandal) కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొన్నె మహేందర్ రెడ్డి, తండ్రి శ్రీనివాస్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ స్పందించి, రూ. 2,50,000 సీఎంఆర్ఎఫ్ ఎల్వోసి మంజూరు చేయించారు. బుధవారం రోజున ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి మంజూరు పత్రాన్ని అందజేశారు. ఎల్ఓసి మంజూరుకు సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Bhuvanagiri MP Chamala Kiran Kumar Reddy) కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు