అధికారుల వల్లే తప్పదం
హైదరాబాద్: 22ఏ నిషేధిత భూములపై(22A prohibited lands) ఉన్న వాస్తవాలను శాసనసభ దృష్టికి తేకపోతే ప్రజల్లో అపోహలు వస్తాయని, 22ఏ కు సంబంధించి సాంకేతిక తప్పిదంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) హయంలో 1999లోనే 22ఏ చట్టం(22A Act) తెచ్చారని, 22 చట్టం గతంలోనే ఉంటే దానికి 'ఏ'నిషేదిత జాబితా చేర్చారని, కోర్టు జోక్యం వల్ల 22ఏ నిషేధిత జాబితా చట్టం అగిపోయిందని ఆయన తెలిపారు. జీవో కావున కొట్టేసి కోనేరు రంగారావు సిఫార్సులతో 2007లో చట్టం తెచ్చారని, 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణీ తేవడంతో అధికారుల అత్యుత్సాహం వల్ల తప్పదం జరిగిందని కూనంనేని వెల్లడించారు.
ధరణి వల్ల కేసీఆర్ తో పాటు ప్రజలకు చాలా నష్టం జరిగిందని, ధరణి వల్ల జరిగిన తప్పిదాలను సరిచేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూభారతిని తెచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భూభారతిలో కూడా ఇవే తప్పుడు లెక్కలు ఉన్నాయని, చివరి 3 లక్షల ఎకరాలు మాత్రమే ప్రైవేటు భూములున్నాయని, ప్రైవేటు భూములను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్యే కూనంనేని సూచించారు.