కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఇంటలిజెన్స్ ఆరా.!

16-09-2026 | 04:54pm

బోథ్. సెప్టెంబర్ 16 ( విజయకాంత్): నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) పనితీరుపైన ఇంటెలిజెన్స్ వర్గాలవారుఆరా తీస్తున్నాయి. ఇటీవల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాదవ్ నరేష్ పైన బోత్ నియోజకవర్గ ఇన్చార్జి తోపాటు మరి కొంతమంది నాయకులు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పనితీరుపైన ఆ పార్టీ ఆది నాయకులు నివేదిక తెప్పించుకుంటున్నట్లు సమాచారం. 

గ్రామస్థాయిలో పార్టీ పనితీరు పైన ఆర

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గ్రూపు విభేదాల గురించి గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తల ద్వారా ఇంటెలిజెన్స్ వర్గాల వారు తెలుసుకుంటున్నట్లు సమాచారం. అసలు పార్టీలో జరుగుతున్నది ఏమిటి. ఎందుకు గ్రూపు విభేదాలు పునరావృతం అవుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. మరోవైపు గ్రూపు విభేదాల వల్ల పార్టీకి ఏమిరా నష్టం సంభవిస్తుంది అనే విషయాన్ని క్లుప్తంగా సేకరించినట్లు తెలిసింది. పార్టీ మరింతగా బలపడాలంటే తీసుకోవలసిన చర్యల గురించి క్రింది స్థాయి నాయకులను అడిగినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలా అనే విషయమై అధిష్టానానికి ఇంటలిజెన్స్ వరగల వారు నివేదిక ఇవ్వనట్లు సమాచారం. 

సమర్థులు ఎవరు అనే విషయం చర్చ

రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేను ఢీకొనేందుకు ఏ నాయకుడు సమర్థత అనే విషయాన్ని అధిష్టానం కార్యకర్తలను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.. డి లిమిటేషన్ వల్ల పార్టీకి నష్టమా లాభమా అనే విషయం అడుగుతున్నారు. ఢిల్లీ మెడిటేషన్ వల్ల ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది అనే విషయమై ఇంటలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని తీసుకుంటున్నట్లు తెలిసింది. కార్యకర్తల అభీష్ట మేరకే సరైన వ్యక్తిని ఎన్నికల బరిలో దించాలన్న ముందస్తు వ్యూహంతో అధిష్టానం సర్వే చేయించినట్లు తెలుస్తున్నది. పరస్పర ఫిర్యాదులతో అధిష్టానమే రంగంలోకి దిగి పార్టీ పరిస్థితి చక్కదిన్నెందుకు ముందు వెళ్లనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నియోజకవర్గంలో పార్టీలో గ్రూపు విభేదాలు లేకుండా చూసేందుకు అధిష్టానం చర్యలు చేపట్టినట్లు తెలిసింది.






మరిన్ని వార్తలు