జగ్గన్నపేట క్రీడా పాఠశాలకు అనుమతుల కోసం సీతక్క విజ్ఞప్తి

16-09-2026 | 01:52pm

క్రీడా పాఠశాల నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు చేయండి

మంత్రి వాకాటి శ్రీహరికి సీతక్క విజ్ఞప్తి 

ములుగు, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): జిల్లాలోని జగ్గన్నపేట గ్రామంలో మంజూరైన క్రీడా పాఠశాల(Sports School) నిర్మాణ పనులకు సరిత గతిన అనుమతులు మంజూరు చేయాలని క్రీడా శాఖ మంత్రి వాకాటి శ్రీహరికి మంత్రి సీతక్క బుధవారం విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో మంత్రి సీతక్క శ్రీహరి నీ కలిసి తన స్వగ్రామమైన జగ్గన్నపేటలో క్రీడా పాఠశాల నిర్మాణ పనులకు అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. దీంతో స్పందించిన శ్రీహరి సకాలంలోనే అనుమతులు అందజేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు