నిజాం వన్ ఆఫ్ ద బెస్ట్ రూలర్

16-09-2026 | 02:22pm

రికార్డులు లేకపోవడంతోనే రియల్ ఎస్టేట్ మాఫియాకు అడ్డా.

 బలవంతుడిదే రాజ్యం అన్నట్లు భూమి చేతులు మారింది.

హైదరాబాద్ చుట్టుపక్కల భూముల్లోనే భూవివాదాలు.

హైదరాబాద్: పాలకుల్లోనే అత్యంత గొప్ప పాలకుడు నిజాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అసెంబ్లీల్లో కొనియాడారు. నిజాం పాలనలో(Nizam's Rule) రైతుల దగ్గర 60 శాతం భూమి, నిజాం దగ్గర 40 శాతం భూమి ఉండేదన్నారు. హైదరాబాద్ చుట్టు నిజాం భూములకు హద్దులు లేవని వివరించారు. హైదరాబాద్ చుట్టుపక్కల నిజాం, జమీందార్ల ప్రాపర్టీలకు సరైన హద్దులు లేవని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. భూములకు విలువ లేని సమయంలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాయించుకున్నారని తెలిపారు. అందుకే హైదరాబాద్ చుట్టుపక్కల భూముల్లోనే అత్యంత భూవిభేదాలు ఉన్నాయని సూచించారు.

సరైన రికార్డులు లేకపోవడంతోనే రియల్ ఎస్టేట్ మాఫియాకు(Real Estate Mafia) అడ్డగా మారిందని సీఎం స్పష్టం చేశారు. బలవంతుడితే రాజ్యం అన్నట్లుగా భూమి చేతులు మారిందని ఆరోపించారు. 1954-55లో సమగ్ర భూ రికార్డులను ప్రకటించారని వెల్లడించారు. ఇప్పటికీ భూ రికార్డులకు 1954 కాస్రా పహాణీనే(Khasra Pahani) ప్రామాణికం అన్నారు. కాస్రా పహాణీలో భూ యజమానులు, అనుభవదారుల పేర్లు ఉండేవన్న సీఎం ధరణి తీసుకొచ్చి అనుభవ దారుల వివరాలు లేకుండా చేశారని తెలిపారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భూహక్కులు లేకుండా పోయాయని సూచించారు.


మరిన్ని వార్తలు