దివ్యాంగుల డిమాండ్లు న్యాయమైనవే
- డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తే అడ్డుకుంటారా?
- దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ ఏమైంది?
- కాంగ్రెస్ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసింది
హైదరాబాద్: దివ్యాంగుల డిమాండ్లు న్యాయమైనవేనని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) స్పష్టం చేశారు. డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. దివ్యాంగుల పింఛన్ ను రూ. 6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి33 నెలలైనా ఎందుకు అమలు చేయట్లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీని అమలు చేయాలన్నారు. దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ(Filling of backlog posts) హామీ ఏమైంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ. లక్షల రుణ హామీని అమలు చేయాలని కోరారు.
దివ్యాంగుల సమస్యలపై తగ్గేదేలే!: బీజేపీ ఎమ్మెల్యేలు
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి అసెంబ్లీ వరకు వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) దివ్యాంగుల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దివ్యాంగుల హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెన్షన్ పెంపు, 5 లక్షల లోన్, ఉచితంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ(Distribution of Indiramma houses) తదితర డిమాండ్లను అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, శ్రీ రామారావు పాటిల్, బీజేపీ నాయకులు, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు.