చిలకలగూడలో దారుణం.. ఏం జరిగిందంటే?

16-09-2026 | 09:17am

ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో(Chilakalguda) వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థికలావాదేవీలతో నిజాముద్దీన్ శ్రీనివాస్ ను కిరాతకంగా హత్య చేశాడు. డబ్బు తీసుకున్న శ్రీనివాస్ కుమారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీల విషయంలో శ్రీనివాస్, నిజాముద్దీన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో వెంట తెచ్చుకున్న కత్తితో నిజాముద్దీన్ శ్రీనివాస్ ను హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు(Chilakalaguda Police) నిజాముద్దీన్‌ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు