తెలంగాణ విమోచన దినోత్సవం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
16-09-2026 | 05:08pm
బోథ్. సెప్టెంబర్ (విజయక్రాంతి): చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం తాసిల్దార్ మల్లేష్ కు వినతి పత్రం అందించారు.
1948 సెప్టెంబర్ 17న నిజాం పాలన నుండి రాష్ట్రం విముక్తి చెందిందని ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని అధికారికంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి మండల పార్టీ కన్వీనర్ బోరి రవీందర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జీవీ రమణ సీనియర్ నాయకులు సుభాష్ సూర్య బీజేవైఎం జిల్లా నాయకులు మానాల శేఖర్ రంజిత్ సింగ్ యువ నాయకులు పచ్చకాయల హరీష్ తదితరులు పాల్గొన్నారు.