మెయిన్ కాల్వ పనులను అడ్డుకున్న రైతులు
16-09-2026 | 08:41am
కొల్లాపూర్ రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సున్నపుతాండ సమీపంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(Palamuru-Rangareddy Lift Irrigation Scheme) మెయిన్ కాల్వ పనులను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. ఈఈ అమర్‌సింగ్‌ను నిర్బంధించి, అధికారుల వాహనం ముందు బైఠాయించారు. మెయిన్ కాల్వ పనులతో మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Mahatma Gandhi Kalwakurthy Lift Irrigation Scheme) డీ–5 కాల్వకు నీటి సరఫరా నిలిచిపోయి ఐదు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందించే వరకు పనులు నిలిపివేయాలని, ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.