జనగామలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
25-10-2026 | 02:52pm
జనగామ, అక్టోబర్ 25 (విజయక్రాంతి): జనగామ(Jangaon) పట్టణ కేంద్రంలోని బతుకమ్మ కుంట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని కీర్తన (16) ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్ లోని నారాయణ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న బాలిక దసరా సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చింది. తెల్లవారుజామున తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.