హుండీల లెక్కింపులో రూ.13.12 లక్షల ఆదాయం

27-10-2026 | 05:57pm

చిల్పూర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): దేవాదాయ ధర్మాదాయ శాఖ(Endowments Department) నలగొండ జోన్ పర్యవేక్షకులు ఎన్. నిఖిల్ ఆధ్వర్యంలో మంగళవారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు వరకు లెక్కించిన 218 హుండీల ద్వారా మొత్తం రూ.13,12,101 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనితో పాటు మిశ్రమ వెండి, బంగారం, అలాగే జపాన్, ఇంగ్లాండ్, ఆఫ్రికా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా లభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఈఓ లక్ష్మీప్రసన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు