తరిగొప్పుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

23-10-2026 | 02:51pm

జనగామ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) అన్నారు.శుక్రవారం తరిగొప్పుల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి 8, 9, 10వ తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ఆంగ్ల పాఠాలు చదివించి పఠన నైపుణ్యాన్ని పరిశీలించారు.

ఎంఆర్‌సీ భవన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, డిజిటల్ స్క్రీన్లు, కంప్యూటర్లు సరిగా పనిచేసేలా చూడాలని సూచించారు. ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ గదులు, వంట గది, లైబ్రరీలను పరిశీలించారు.

మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేసి ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందించాలని, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని, నీటి సంప్ పై మూత, విద్యుత్ స్తంభాల తొలగింపుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు