బస్టాండ్‌లో గడ్డివాము, ఇటుకల దందా
తరిగొప్పుల, నవంబర్ 2 (విజయక్రాంతి): తరిగొప్పుల మండల పరిధి ఎన్యానాయక్ తండా చౌరస్తాలో(Enyanayak Thanda Crossroads) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బస్టాండ్ పరిస్థితి దారుణంగా మారిందని, బస్టాండ్ లోపల గడ్డివాము, బయట ఇటుకలు, రింగుల తయారీతో ప్రైవేటు గోడౌన్‌గా మార్చేశారని బీఆర్ఎస్ మండల యువ నాయకుడు చిలువేరి సతీష్ మండిపడ్డారు.
ప్రయాణికుల కోసం నిర్మించిన బస్టాండ్‌ను కొందరు వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటూ ప్రజా రవాణాకు ఆటంకం కలిగిస్తున్నారని, దీంతో ప్రయాణికులు ఎండలో, వానలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బస్టాండ్‌లోని అక్రమాలను తొలగించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.