ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
27-10-2026 | 09:54pm
కొడిమ్యాల, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామానికి(Nachupalli Village) చెందిన కొలకాని హనుమండ్లు(55) గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూ మనస్థాపానికి గురై ఈనెల 25 తేదీ ఆదివారం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్లి,26 తేదీ సోమవారం నాచుపల్లి లో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య కొలకాని రాధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు కొడిమ్యాల ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.