6 September, 2026 | 1:19 AM

కేఏ పాల్‌పై చర్యలు తీసుకోవాలి

06-09-2026 | 12:10am
  1. డేవిడ్ రాజు హత్య కేసుపై 16 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా
  2. డీజీపీకి డేవిడ్ రాజు భార్య ఎస్తేర్ రాణి ఫిర్యాదు

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : 2010లో జరిగిన డేవిడ్ రాజు(David Raju) హత్య కేసు(murder case)లో కేఏ పాల్‌(KA Paul)పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డేవిడ్ రాజు సోదరుడు, డేవిడ్ రాజు భార్య ఎస్తేర్ రాణి(Esther Rani) విజ్ఞప్తి చేస్తూ శనివారం డీజీపీ సీవీ ఆనంద్‌(DGP CV Anand)కు ఫిర్యాదు చేశారు. హత్యకు బాధ్యులైన వా రిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని కో రారు. కేఏ పాల్ కుటుంబం, డేవిడ్ రాజు కుటుంబంతో పాటు మరికొందరు కలిసి 1990 ప్రాంతంలో టీఏపీపీసీ, జీయూ ఎం వంటి మినిస్ట్రీస్ సంస్థల(ministries and organizations)ను ఏర్పాటు చేశారని ఎస్తేర్ రాణి తన ఫిర్యాదులో పే ర్కొన్నారు.

ఈ సంస్థల ద్వారా తెలంగాణ(Telangana), ఏపీ(AP) రాష్ట్రాల్లోని అనాథలకు విద్య అందించడం, వితంతువులకు సహాయం చేయ డం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ సంస్థలకు ప్ర స్తు తం మార్కెట్ విలువ ప్రకారం రూ.5 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా దాతల నుంచి వచ్చిన నిధు లతో వాటిని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.

2006లో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, ఆ సమయంలో ఎన్నికల అవసరాల కోసం సంస్థల ఆస్తులను విక్రయించి ని ధులు సమకూర్చాలని ప్రయత్నించారని ఫిర్యాదులో ఆరోపించారు. అయితే డేవి డ్ రాజు, ఆయన కుటుంబ సభ్యులు దీని ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. దాతల నుంచి వచ్చిన నిధులతో ఏర్పడిన సంస్థల ఆస్తులను విక్రయించడం చట్టవిరుద్ధమని డేవిడ్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే డేవిడ్ రాజుపై కేఏ పాల్ కక్ష పెంచుకున్నారని, 2010లో తన అనుచరుల ద్వారా హత్య చేయించేందుకు కుట్ర పన్నారని ఆమె ఆరోపించారు. డేవిడ్ రాజు భార్యగా తాను ఆయనకు న్యాయం చేయాలని గత 16 ఏళ్లుగా పోరాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. డేవిడ్ రాజు మరణం వెను క ఉన్న వాస్తవాలను వెలికి తీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. కేసును ప్రభావితం చేసేందుకు కేఏ పాల్ తన పరిచయాలు, పలుకుబడి ని ఉపయోగిస్తున్నారని  ఆరోపించారు. 

మరిన్ని వార్తలు