6 September, 2026 | 1:28 AM

గంజాయి నియంత్రణకు చర్యలు: ఎస్పీ నితిక పంత్

06-09-2026 | 12:18am

సిర్పూర్(యు)(విజయక్రాంతి): గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ నితిక పంత్(SP Nitika Pant) తెలిపారు. సిర్పూర్ (యు) మండలంలోని బుర్నూర్, గుట్టగూడ గ్రామ శివార్లలో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలపై(marijuana plants) పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో మూడు కేసులకు సంబంధించి 460 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని, నలుగురిని అరెస్ట్ చేశారు.

జీర్లగాట్‌కు చెందిన గెడం లోబాజీ, గెడం జయవంత్, కుమ్రా మాధవరావు, గుట్టగూడకు చెందిన పెందోర్ సూర్యబానును నిందితులుగా గుర్తించారు. వారి వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు(Cannabis cultivation) చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ  హెచ్చరించారు. జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ప్రత్యేక నిఘా, తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు