6 September, 2026 | 2:27 AM

బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది

06-09-2026 | 12:37am

బూర్గంపాడు,(విజయక్రాంతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) 1000 రోజుల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పోతిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. బూర్గంపాడు మండలం(Burgampadu Mandal) లక్ష్మీపురంలోని శ్రీ వెంకటేశ్వర ఎగ్‌ ట్రేస్‌ కంపెనీ ఆవరణలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూలపెల్లి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ కుటుంబ సభ్యుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసా, రుణమాఫీ, మహాలక్ష్మి, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ధాన్యానికి రూ.500 బోనస్‌, కొత్త రేషన్‌ కార్డులు తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.

మరిన్ని వార్తలు