6 September, 2026 | 2:27 AM

వంటా వార్పుతో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్ సెగ

06-09-2026 | 12:48am

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారు: మహేందర్‌రెడ్డి, కావ్య

జవహర్‌నగర్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా శనివారం జవహర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, మాజీ మేయర్ మేకల కావ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీఆర్‌ఎస్ హయాంలోనే జవహర్‌నగర్‌లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, వాటిని తమవిగా చెప్పుకోవడం సరికాదన్నారు.

ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. అనంతరం బీఆర్‌ఎస్ శ్రేణులు కేసీఆర్ పాటలకు నృత్యాలు చేస్తూ నిరసన తెలిపారు. వంటావార్పు నిర్వహించి సుమారు 900 మంది పేదలకు అన్నదానం చేశారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్, ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు జిట్టా శ్రీనివాసరెడ్డి, మాజీ కార్పొరేటర్లు సంగీత రాజశేఖర్, శ్రీ వాణి, రవి, సతీష్, వెంకటేష్, ప్రసాద్ గౌడ్, బాలరాజ్ పటేల్, పంతంగి సిద్ధులు యాదవ్, శ్రీరాములు, దిలీప్, అహ్మద్ పాషా, సాయి, అశోక్, మహేష్, సోమయ్య, రాజేష్, విలాసాగర్ రవి, లక్ష్మణ్, ప్రశాంత్, కేతమ్మ, మంజుల, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు