పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభం
హనుమకొండ, అక్టోబర్ 23(విజయ క్రాంతి): వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో(Background of the MLC elections) 31 వ డివిజన్ న్యూ శాయంపేట లో అర్హులైన పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు తాజా మాజీ కార్పొరేటర్ మామిండ్ల రాజు యాదవ్ ప్రారంభించారు. అనంతరం మామిండ్ల రాజు యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం,
యువత భవిష్యత్తు, న్యూ శాయంపేట అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలనీ,అర్హులైన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. అనంతరం అర్హులైన పట్టభద్రుల ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించి, ఓటర్ నమోదు గూర్చి వివరించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి మార్క విజయ్, డివిజన్ అధ్యక్షులు సత్తు రమేష్, మాజీ అధ్యక్షులు అంకేశ్వర్, సురేందర్, నాగనబోయిన బాబురావు, శీలం శీను, డిసిసి మెంబర్ మామిండ్ల సురేష్ యాదవ్,పిండి రమేష్, కనుకుంట్ల కృష్ణ, ఏనబోతుల సతీష్, మంద సునీల్, బొల్లం పున్నం చందర్, తదితరులు పాల్గొన్నారు.