ఉచిత నేత్ర వైద్య శిబిరం వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
చెన్నూర్, (విజయక్రాంతి): లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో ఈ నెల 27న చెన్నూర్‌లోని సాయిరాం ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం వాల్‌పోస్టర్‌ను(Free Eye Medical Treatment Camp Wall Poster) శుక్రవారం చెన్నూర్ సీఐ బాన్సిలాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. చెన్నూర్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు(Health Preservation), ముఖ్యంగా కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం గొప్ప విషయమని కొనియాడారు.
కంటి సమస్యలతో బాధపడుతున్న వారు నేత్ర వైద్య శిబిరాన్ని(Eye Camp) సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ చెన్నూర్ అధ్యక్షుడు లయన్ నిమ్మల సాగర్, జోన్ చైర్పర్సన్ లయన్ జాది తిరుపతి, లయన్ బొల్లంపల్లి నాగరాజా గౌడ్, లయన్ పిప్పిరెడ్డి దీక్షిత్, లయన్ ఎన్నం సతీష్ తదితరులు పాల్గొన్నారు.