రామప్పలో వైద్యుల బృందం పర్యటన
వెంకటాపూర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని ప్రపంచ వారసత్వ సంపదగా(World Heritage Site) గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని(Ramappa Temple) శుక్రవారం 120 మంది జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు(Junior doctors and medical students) సందర్శించారు. సేవాంకుర్ భారత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘దేశం కోసం-మూడు రోజులు’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని తాడ్వాయి మండల పరిధిలో ఎనిమిది ఆదివాసీ గ్రామాల్లో వైద్య శిబిరాలు(Medical Camps) నిర్వహించేందుకు తెలంగాణలోని 16 వైద్య కళాశాలలకు చెందిన విద్యార్థులు, వైద్యుల బృందం జిల్లాకు వచ్చారు.
ఈ సందర్భంగా రామప్ప దేవాలయాన్ని సందర్శించి కాకతీయుల చారిత్రక వైభవాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, బృంద సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం టూరిజం గైడ్ విజయ్ కుమార్, స్టేట్ గైడ్ శశి రామప్ప దేవాలయ చరిత్ర, అద్భుత శిల్పకళా వైభవం, కాకతీయుల కళా నైపుణ్యం గురించి వివరించారు.
అనంతరం వైద్యుల బృందం రామప్ప చెరువును సందర్శించి పర్యాటక శాఖ బోట్లలో బోటింగ్ చేశారు. ఈ పర్యటనలో లయన్స్ క్లబ్ సభ్యుడు పింగళి నాగరాజు, ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్, ఎన్ఎస్ఎస్ సభ్యులు తాళ్ల సమ్మయ్య, బోడ మహేందర్, టూరిస్ట్ పోలీసులు శ్రీనివాస్, దశరథ్, శ్రీకాంత్తో పాటు పురావస్తు, దేవాదాయ, పర్యాటక శాఖల సిబ్బంది పాల్గొన్నారు.