సీఈఓ జ్ఞానేష్ కుమార్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలి
సర్ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలి
వరంగల్ (విజయక్రాంతి): సీఈఓ జ్ఞానేష్ కుమార్ను(CEO Gyanesh Kumar) తక్షణమే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వరంగల్ నగరంలోని కాశీబుగ్గ అంబేడ్కర్ సెంటర్లో రైతు సంఘాల(Farmers unions) ఆధ్వర్యంలో సీఈఓ జ్ఞానేష్ కుమార్ చిత్రపటాలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ సీఈవో జ్ఞానేశ్ కుమార్ ను బర్తరఫ్ చేయాలని, ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు.
సర్(SIR) ప్రక్రియ పేరుతో ఆకారణంగా ఓట్ల తొలగింపును(Removal of votes) చేపట్టి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ఏఐకేఎంఎస్, ఏఐయుకేఎస్, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శులు రాచర్ల బాలరాజు, చిర్ర సూరి, చుక్క మొగిలి, కిసాన్ సంఘటన, ఏఐకేఎస్ఎస్ బాధ్యులు సుధామల్ల భాస్కర్, వల్లందాస్ కుమార్ పాల్గొన్నారు.