పెంట్లవెల్లి లో ఎక్స్పెరి డేట్ అయిపోయిన తంసప్లు
బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
పెంట్లవెల్లి అక్టోబర్ 23: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండల కేంద్రంలోని(Pentlavelli Mandal Headquarters) చిన్నంబాయి మండల కేంద్రానికి చెందిన మియాపురం గ్రామ వాస్తవాలు పనిమీద పెంట్లవెల్లి మండలానికి వచ్చారు. మంచాల కట్ట రోడ్ లో ఉన్న శేఖర్ షాపులో తంసప్ తీసుకొని ఫోన్ పే ద్వారా పేమెంట్ చేశారు. తీరా చూస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని షాపు యజమాని ఆరా తీశారు. షాపు యజమానికి మియాపురం గ్రామానికి చెందిన గోపాల నరేష్. రాంప్రకాష్ లపై వాగ్వాదానికి దిగారు. దీంతో పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఎస్సై పవన్ కుమార్. షాపు యజమాని శేఖర్ ను పిలిపించి మందలించి వదిలేశారు. ఇంకోసారి ఇలా జరుగుతే ఊరుకోనని హెచ్చరించారు.