అమ్మకు ప్రేమతో
23-10-2026 | 07:59pm
100 సంవత్సరాల వేడుక
భైంసా అక్టోబర్ 31 ( విజయక్రాంతి) : కుంటాల మండలంలోని(Kuntala Mandal) ఓలా గ్రామంలో గందె కళావతి(Gande Kalavathi) 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలోకి అడుగు వేయడంతో కుటుంబ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కళావతిని కుటుంబ సభ్యులు గ్రామస్తుల మధ్య పూల తో స్వాగతం పలికి వేడుకలు నిర్వహించారు. వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. గ్రామస్తులకు ఉన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా(Ganesh Gupta), ఎన్ఆర్ఐ ప్రదీప్ కుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు