టీపీఓ సునీల్ ను సస్పెండ్ చేయాలనీ ధర్నా

23-10-2026 | 08:02pm

బెల్లంపల్లి: మాజీ కౌన్సిలర్ తాండ్ర రామకృష్ణ(Former Councilor Tandra Ramakrishna) పై చెయ్యి చేసుకొని దురుసుగా ప్రవర్తించిన టీపీవో సునీల్(TPO Sunil) ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు(BRS Councilors) బెల్లంపల్లి మునిసిపల్(Bellampalli Municipal) ఆఫీసు  ఎదుట ధర్నా చేశారు. రోడ్డు విస్తరణ పనుల విషయమై టిపిఓ సునీల్ ను 20వ వార్డు మాజీ కౌన్సిలర్ తాండ్ర రామకృష్ణ(Tandra Ramakrishna) వివరాలు అడిగితే అతనిపై టిపిఓ దురుసుగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. టిపిఓ సునీల్ ను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ రోడ్డుపనుల విషయంలో తనకు వివరాలు కావాలని అడిగితే తనపై దౌర్జన్యం చేసి కుర్చీ లాగి తనపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు ఆరోపించారు. ఈ దాడి విషయమై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి టిపిఓ సునీల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట  పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు