వరంగల్ విజయ డెయిరీ అభివృద్ధి
రూ.1.85 కోట్ల నిధులు మంజూరు
వినియోగదారులకు నాణ్యమైన పాలు, పాల పదార్థాల సరఫరాకు చర్యలు.
హనుమకొండ, అక్టోబర్ 10(విజయక్రాంతి): వరంగల్ జిల్లా(Warangal District) పరిధిలోని విజయ తెలంగాణ డెయిరీ(Vijaya Telangana Dairy) అభివృద్ధి, మరమ్మతులు, మౌలిక వసతుల మెరుగుదల కోసం 1.85 కోట్ల నిధులు మంజూరైనట్లు విజయ డైరీ ఉపసంచాలకులు జి .ధనురాజ్ తెలిపారు. తెలంగాణ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య(Telangana Dairy Development Cooperative Federation) మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ రూ.1.85 కోట్ల నిధుల మంజూరు(Sanction of funds) కు ఉత్తర్వులు జారీ చేశారని, మొదటి విడత గా రూ.89.50 లక్షలు నిధులు మంజూరు చేయుటకు ఉత్తర్వులు ఇచ్చారన్నారు.
విజయ తెలంగాణ డెయిరీ ని ఆధునీకరించి, మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు, పాడి రైతులకు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుంది. డైరీ అభివృద్ధి పనుల్లో భాగంగా పాల ప్యాకింగ్ పనులను అక్టోబర్ 10నుండి నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
అయినప్పటికీ, వినియోగదారులకు పాలు, పాల పదార్థాలు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు.జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం అందిస్తున్న సహకారంతో డెయిరీ అభివృద్ధి, పాడి రైతుల ప్రయోజనాల పరిరక్షణ, వినియోగదారులకు నాణ్యమైన పాల ఉత్పత్తుల సరఫరా మరియు సంస్థ అభివృద్ధికి అవసరమైన చర్యలు కొనసాగుతాయని జి. ధనరాజ్ తెలిపారు.