ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు !
ఎల్ నినో ప్రభావం(The impact of El Niño) వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బియ్యం, పప్పులు, మంచినూనె, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, పసు పు, కారం, కూరగాయలు, మాంసాహారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దినసరి కూలీ కుటుంబాల్లో ఈ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎల్ నినోపై అవగాహన లేమీ...
ఎల్ నినో ప్రభావం వల్ల కలిగే ఇబ్బందులు, నీటి కొరత, విద్యుత్ కోతల పరిస్థితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కలిగించడం లేదు. ఎల్ నినో కారణం తో బాసరలోని ట్రిపుల్ ఐటీకి దస రా సెలవులు పొడిగించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ డిసెంబర్లో మొదలవుతుందనుకుంటే అక్టోబర్లోనే ట్రిపుల్ ఐటీకి సెలవులివ్వడం.. వేసవిలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదివే పిల్లలు,
ఇంటర్మీడియట్, డిగ్రీ చేసే విద్యార్థులు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలలో 2026- విద్యా సంవ త్సరంపై ఎల్ నినో ప్రభావం ఏ విధంగా ఉంటుందోనని అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు గుబులు చెందుతున్నారు. మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలోని సంబంధిత మంత్రులు, అధికారులు ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు ఎల్ నినో ప్రభావం లేకుండా తీసుకుం టున్న ముందు జాగ్రత్త చర్యలు గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది.
పెద్దగా పట్టించుకోని ప్రజలు...
ఎల్ నినో ప్రభావం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయని, నీటి ఎద్దడి, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని, వ్యవసాయానికి సాగునీరు ఉండదని, ప్రజలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని, నీటి వినియోగం తగ్గించుకోవాలని, బోర్లు వేయకూడదని, వాహనాల శుభ్రం పేరుతో నీటిని వృథా చేయవద్దని, పచ్చి గుడ్డతో బండ్లను శుభ్రం చేసుకోవాలని జిల్లాలలో కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసిన అవి సామాన్య ప్రజల వద్దకు చేరకపోవడం వల్ల నీటిని ఎంతో దుబారా చేస్తున్నారు.
దసరా పం డుగ రోజున అనేక మంది వాహనాలు శుభ్రం చేసుకొని నీటిని వృథా చేశారు. కొన్ని ప్రాంతాల్లో నీటి పైపులు పగిలి వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే కన్పించడం లేదు. రోడ్లపై రాత్రి, పగలు 24 గంటలు లైట్లను ఆర్పడం లేదు. బోర్లను యధావిధిగా వేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు, మన అధికార, ప్రతిపక్ష నాయకులు రాజకీయాల కతీ తంగా ప్రజలకు ఎల్ నినో పై అవగాహన కలిగించాలి. ఇండ్లలో, అపార్ట్మెంట్ లలో బొర్లు వేయకుండా చూడాలి.నీటి వాడకం తగ్గించుకునేటట్లు అవగాహన కలిగించాలి.
రాష్ట్రంలో కొందరు బ్రోకర్లు కొన్ని నిత్యావసర వస్తువులను దాచిపెట్టి ధరలు పెరిగేటట్లు చేస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలను, దినసరి కూలీలను దృష్టిలో పెట్టుకొని నిత్యావసర ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. బియ్యం, మంచి నూనె, ఉల్లిగడ్డలు, పప్పు దినుసులు ప్రభు త్వం చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలి. ఎల్ నినోపై కూడా అవగాహన కల్పించాలి.
సెల్ : 9290826988