ఆర్మీ జవాన్ ఆత్మహత్య

19-10-2026 | 12:25pm

తాండూరు, అక్టోబర్ 19 (విజయక్రాంతి): దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఓ ఆర్మీ జవాన్ (Army Soldier) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌లో సోమవారం జరిగింది.ఎస్సై విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన బోయిని మల్లేశం పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ముగ్గురు సోదరీమణులకు వివాహాలు చేసిన ఆయన, ఎనిమిది నెలల క్రితం తాను కూడా వివాహం చేసుకున్నాడు.సెలవులపై ఇంటికి వచ్చిన మల్లేశం అందరితో కలివిడిగా, నవ్వుతూ ఉండేవాడని గ్రామస్థులు తెలిపారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేస్తున్నారు.

మరిన్ని వార్తలు