జూదం ఆడుతున్న ఏడుగురు అరెస్ట్

29-11-2026 | 07:02am

రూ.21,010 నగదు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం

కరీంనగర్ క్రైం, నవంబర్ 29 (విజయక్రాంతి): కొత్తపల్లి పోలీస్ స్టేషన్(Kottapalli Police Station) పరిధిలోని రేకుర్తి ప్రాంతంలో జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు శనివారం రాత్రి పోలీసులు దాడి నిర్వహించి 7గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.21,010 నగదు, 9 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ముత్యాల సంతోష్ కుమార్ (36), పులిచెర్ల శశికిరణ్( 35), దూస ధర్మేందర్ (48) , సయ్యద్ సాదిక్(40), ముత్తూరి సాయి విక్రమ్(43), కసరపు కిషోర్ కుమార్,(45), గుజ్జుల వెంకటసూర్య ప్రతాప్ రెడ్డి(35)లు ఉన్నారు.

మరిన్ని వార్తలు