అండాల అక్రమ దందా..487 కోట్ల రాకెట్!

29-11-2026 | 05:20am
  1. నెలకు రూ.28 కోట్ల ఆదాయం, డాక్టర్లకు లక్షల్లో వేతనాలు
  2. కార్పొరేట్ పెద్దల భాగస్వామ్యం 
  3. ఓయాసిస్ ఫెర్టిలిటీకి చెందిన ఇద్దరు అధికారుల అరెస్టు
  4. చైర్మన్ సూర్యకిరణ్ కోసం గాలింపు 
  5. దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో అండాల సేకరణ
  6. వెల్లడించిన మల్కాజిగిరి సీపీ సుమతి

ఎల్బీనగర్, నవంబర్ 28: అండాల దందాలో అక్రమార్కులు(Fertility Egg Trafficking) కేవలం ఎనిమిది నెలల్లోనే దేశ వ్యాప్తంగా రూ.487 కోట్ల లావాదేవీలు జరిపారని మల్కాజిగిరి సీపీ సుమతి(Malkajgiri CP Sumathi) వెల్లడించారు. దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో అండాల సేకరణ చేశారని, ఈ దందాలో కార్పొరేట్ పెద్దల భాగస్వామ్యం ఉన్నదని చెప్పారు. ఈ క్రమంలోనే ఓయాసిస్ ఫెర్టిలిటీకి చెందిన ఇద్దరు అధికారులను అరెస్టు చేసినట్టు తెలిపారు. చైర్మన్ సూర్యకిరణ్ కోసం గాలింపు చేపడుతున్నట్టు పేర్కొ న్నారు. శనివారం ఎల్బీనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

మహిళల అండాలను అక్రమంగా సేకరించి, వ్యాపారంగా మార్చుకున్నట్లు ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ నెట్‌వర్క్‌లో మరో ఇద్దరు కీలక వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశామన్నారు. సద్గురు హెల్త్‌కేర్ ప్రైవే ట్ లిమిటెడ్‌కు చెందిన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రతిక్ అనిల్ గగ్లానీ (44), మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ రాజర్షి దేబ్ (53)ని సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి విచారణలో దేశవ్యాప్తంగా విస్తరించిన అండాల సేకరణ నెట్వర్క్, భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు వెలుగు లోకి వచ్చినట్లు వెల్లడించారు. 

సద్గురు హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంస్థ నిర్వహిస్తున్న 43 క్లినిక్‌లలో ప్రతినెలా 600 స్వీయ చికిత్సా చక్రాలు, మరో 100 అండాల దాన ప్రక్రియలు జరుగుతున్నట్లు వివరించారు. వీటి ద్వారా నెలకు రూ.27- కోట్ల ఆదాయం వస్తున్నట్లు పేర్కొన్నారు. సద్గురు హెల్త్‌కేర్ సం స్థకు సంబంధించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 26 వరకు జరిగిన డెబిట్, క్రెడిట్ లావాదేవీల మొత్తం విలువ రూ.487.82 కోట్లుగా తేలిందని సీపీ సుమతి వెల్లడించారు.

ఈ భారీ లావాదేవీలపై మరింత లోతుగా ఆరా తీస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిక్ గగ్లానీ సద్గురు హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా 2025 నుంచి పని చేస్తున్నాడు. ఫెర్టిలిటీ కేం ద్రాల నిర్వహణ, వైద్య పరికరాల కొనుగోలు, నిధుల సమీకరణ, కార్యకలాపాల పర్యవేక్షణలో కీలకంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరో నిందితుడు డాక్టర్ రాజర్షి దేబ్.. ఫెర్టిలిటీ కేంద్రాల్లో వైద్యుల నియామకాలు, ఆపరేషన్ థియేటర్ల నిర్వహణ, వైద్య పరమైన కార్యకలాపాలను పర్యవేక్షించినట్లు వెల్లడించారు.

నిబంధనలకు విరుద్ధమైన విధానాలకు అంగీకరించే వైద్యులను నియమించాలని యాజమాన్యం సూచించినట్లు ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారని తెలిపారు. అధిక వేతనాలు, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ వ్యవహారాల్లో పాల్గొన్నట్లు ఇద్ద రు నిందితులు వెల్లడించారని వివరించారు.

మహిళలకు అండాల ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ మందులు, ఇంజెక్షన్లు ఇచ్చి తదుపరి వైద్య ప్రక్రియలకు పంపినట్లు విచార ణలో వెలుగుచూసింది. అండాల అక్రమ సేకరణ కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని సీపీ సుమతి తెలిపారు. 

ఓయాసిస్ చైర్మన్ సూర్యకిరణ్ కోసం గాలింపు

సద్గురు హెల్త్ కేర్ సంస్థ ద్వారా చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించిన ప్రధాన నిందితులలో ఒకడైన వెంకట సూర్య కిరణ్ గేదెల ఇతర కంపెనీల్లో కూడా డైరెక్టర్‌గా వ్యవహరించాడు. సద్గురు సాప్ట్‌వేర్ సంస్థలో సూర్యకిరణ్ తోపాటు మాజీ మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమా కల్వకుంట్ల కూడా గతంలో కొంతకాలం పాటు డైరెక్టర్‌గా ఉన్నారు. దీం తో పాటు సూర్యకిరణ్ ఆధ్వర్యంలో కొనసాగిన జెన్మెడ్ హెల్త్ కేర్ సంస్థలో కూడా శైలిమ డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారని సమాచారం.

కాగా, ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పురోగతి జరిగింది. ఫెర్టిలిటీ సెంటర్ డైరెక్టర్ మేఘనను బెంగళూరులో ఆమెతో పాటు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. ఫెర్టిలిటీ సెంటర్లో మహిళల అండాల సేకరణలో మేఘన కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా, పరారీలో ఒయా సిస్ చైర్మన్ సూర్యకిరణ్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేశారు. సూర్యకిరణ్ ఇప్పటికే దేశం దాటి వెళ్లి ఉంటాడని మల్కాజిగిరి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు