డీలిమిటేషన్ వద్దు!

29-11-2026 | 05:25am

ప్రజాప్రతినిధుల సంఖ్య పెంపుతో జవాబుదారీతనం పెరుగుతుందా?

కొండంత అవినీతి ఆకాశానికి! ప్రజలకు ఇది ప్రయోజనకరమా?

చాలామంది ప్రజాప్రతినిధులకు ప్రజా సంక్షేమం కంటే వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడం, అధికారిక సదుపాయాలను పొందడం, స్థానికంగా తమ రాజకీయ ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా మరిన్ని స్థానాలను పెంచడం వల్ల జవాబుదారీతనం ఎలా పెరుగుతుంది? పైగా ఈ ప్రయోజనాల కోసం పోటీపడే వారి సంఖ్య మాత్రమే పెరుగుతుంది.

మెరుగైన ప్రాతినిధ్యానికి, మహిళలకు రిజర్వేషన్లు (Reservations for women) కల్పించడానికి.. ప్రజాస్వామ్య ప్రయో జనాల పేరుతో డీలిమిటేషన్ ప్రక్రియను(Delimitation process) ప్రతిపాదిస్తున్నారు. వాస్తవానికి దీంతో ప్రభుత్వ ఖర్చులను విపరీతంగా పెంచడంతోపాటు, అవినీతిని మరింతగా ప్రోత్సహించి, అధికార అసమానతలను మరింత పెంచే ప్రమాదం ఉంది. అదే సమయంలో సామాన్య ప్రజలు మాత్రం.. తమ సమస్యలను పట్టించుకోని, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించే చట్టసభలతో ఇబ్బందులు పడటం కొనసాగుతోంది.

కాగితాలపై చూస్తే ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య పెంచడం సమంజసంగానే కనిపిస్తుంది. జనాభా పెరిగింది. కాబట్టి ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరిగితే ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారిస్తారని, ప్రభుత్వ పనితీరుపై మెరుగైన పర్యవేక్షణ ఉంటుందని, అభివృద్ధికి ఉపయోగపడే చట్టాలు రూపొందుతాయని భావించడం సహజం. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. గత దశాబ్ద కాలంగా భారత పార్లమెంటు పనితీరును పరిశీలిస్తే అర్థవంతమైన చర్చలు తగ్గిపోవడం, కీలక చట్టాలను హడావుడిగా ఆమోదించడం, నిరంతర సభా అంతరాయాలు, ప్రజా సంక్షేమం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది.

పార్లమెంటు పనితీరునే పరిశీలిద్దాం.. 17వ లోక్‌సభ (2019- సుమారు 35 శాతం బిల్లులు గంటలోపు చర్చతోనే ఆమోదం పొందాయి. కేవలం 16 శాతం బిల్లులు మాత్రమే సమగ్ర పరిశీలన కోసం శాఖాపరమైన స్థాయీ సంఘాలకు పంపించారు. 15వ లోక్‌సభలో ఈ సంఖ్య 71 శాతంగా ఉండటం గమనార్హం. ఇటీవలి సంవత్సరాల్లో బడ్జెట్‌లోని 67 నుంచి 80 శాతం ప్రతిపాదనలు సరైన చర్చ లేకుం డానే ఆమోదం పొందినట్లు పలు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం కూడా ఆశించిన స్థాయిలో వినియోగించుకోవడం లేదు.

నిరసనలు, వాయిదాల కారణంగా పార్లమెంటు సమావేశాల్లో అనేకసార్లు నిర్ణీత సమయం గణనీయంగా వృథా అవుతోంది. వర్షాకాల, శీతాకాల సమా వేశాల్లో లోక్‌సభ ఉత్పాదకత కేవలం 15 శాతానికి పడిపోయింది. కీలకమైన చట్టాలపై చర్చించాల్సిన గంటల తరబడి సమయం వృథా అవుతుండగా, గందరగోళ పరిస్థితుల  మధ్య మూజువాణి ఓటుతో చట్టాలు ఆమోదం పొందుతున్నాయి. కొన్ని సమావేశాల్లో బడ్జెట్‌పై ఒక్క మాట కూడా చర్చించకుండానే మొత్తం బడ్జెట్‌ను ఆమోదించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇవి ఏవో అప్పుడప్పుడు జరిగే పొరపాట్లు కావు. చట్టాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, వాటిపై జరిగే చర్చల నాణ్యత క్రమంగా దిగజారుతున్నదనడానికి ఇవి స్పష్టమైన ఉదాహరణలు. కొన్ని పార్లమెంటు సమావేశాలు ముగిసే సమయానికి నిమిషాల వ్యవధిలోనే అనేక బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక వర్షాకాల సమావేశంలో లోక్ సభలో 11 నుంచి 12 బిల్లులు దాదాపు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. గతంలో వ్యవసాయ చట్టాలు, క్రిమినల్ చట్టాల్లో భారీ మార్పులు, ఇతర కీలక చట్టాలు కూడా తగినంత పరిశీలన, చర్చ లేకుండానే ముందుకు తీసుకెళ్లారు.

ప్రతిపక్ష సభ్యులను గణనీయమైన సంఖ్యలో సస్పెం డ్ చేయడంతో.. సభలో వారి ప్రాతినిధ్యం లేకుండానే బిల్లుల ఆమోదానికి మార్గం సుగమం చేశారు. పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయాల వల్ల ప్రజాధనానికి దశాబ్ద కాలంలో వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. ప్రజల సమస్యలను ప్రతిబింబించాల్సిన పార్లమెం టు వేదిక తరచూ బహిష్కరణలు, వాకౌట్లు, విధానపరమైన అడ్డదారులకు కేంద్రంగా మారుతోంది. నిజమైన ప్రజా సమస్యలకు మాత్రం రెండో ప్రాధాన్యత లభిస్తోంది.

ఈ వ్యవస్థకు.. మరింత విస్తరణ..

ఇలాంటి పరిస్థితుల్లో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను పెంచడం సంస్కరణలా కాకుం డా, ఇప్పటికే సరిగా పనిచేయని వ్యవస్థను మరింత విస్తరించడంగానే కనిపిస్తోంది. అదనంగా ఎంపీలు అంటే.. ప్రభుత్వంపై అదన పు వార్షిక ఆర్థిక భారం పడటమే. ఒక ఎంపీ జీతం, అలవెన్సులు, కార్యాలయ సిబ్బంది, ఇతర సదుపాయాలు, ప్రయోజనాలన్నింటినీ కలిపి లెక్కిస్తే, ఒక్కో ఎంపీ నిర్వహణకు ఏటా లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేయవచ్చు.

ఎంపీలాడ్స్ నిధులు, విస్తృతమైన ఇతర సదుపా యాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ భారం మరింత పెరుగుతుంది. వందల సంఖ్యలో కొత్తగా ఎంపీ స్థానాలను పెంచితే, కేవలం వారి నిర్వహణకే ఏటా వందల కోట్ల రూపాయల అదనపు ప్రజాధనం ఖర్చవుతుంది. దీనికి పార్లమెంటు భవనాలు, మౌలిక సదుపాయాలు, భద్రత, నివాస గృహాల ఏర్పాటుకు అయ్యే ఖర్చు అదనం. రాష్ట్ర శాసనసభల విషయంలోనూ ఇదే పరిస్థితి మరింత విస్తృత స్థాయిలో ఉంటుంది.

అంతేకాదు, ప్రజల నుంచి దోచుకునేందుకు మరో వందల మంది ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించినట్లే అవుతుంది. ప్రజా సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే ఎం పీలు, ఎమ్మెల్యేల శాతం రోజురోజుకూ తగ్గిపోతున్నదనే ఆందోళన ఉంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ప్రజాప్రతినిధుల ఆస్తుల్లో కనిపిస్తున్న భారీ పెరుగుదలే ప్రజాధనం ఏ స్థాయిలో దుర్వినియోగం అవుతు న్నదో తెలియజేస్తోంది. అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదల, వారి ఆదాయ వనరులపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

రాజకీయ అవినీతికి పెట్టుబడి..

ఎన్నికల ఖర్చులను పరిశీలిస్తే అసలు సమస్య మరింత స్పష్టమవుతుంది. తెలంగాణనే ఉదాహరణగా తీసుకుందాం. అద నంగా 60 ఎమ్మెల్యే స్థానాలు పెరిగాయని అనుకుందాం. మూడు ప్రధాన రాజకీయ పార్టీలు కలిపి ఒక్కో నియోజకవర్గంలో సుమారు రూ.100 కోట్ల చొప్పున ఖర్చు చేస్తే, మొత్తం ఎన్నికల ప్రచార వ్యయం దాదాపు రూ.6,000 కోట్లకు చేరుతుంది.

ఇంత భారీగా ఖర్చు చేసిన సొమ్మును తిరిగి సంపాదించుకోవడంతోపాటు, లాభాలు ఆర్జించేందుకు జరిగే అవినీతి, అక్రమాలు ఈ ఖర్చుకు అనేక రెట్లు ఉండే అవకాశం ఉంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఈ మొ త్తం రూ.20,000 కోట్లకు మించవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే లెక్కను దేశవ్యాప్తంగా విస్తరించి చూస్తే జరిగే అవినీతి విశృం ఖలత్వం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించవచ్చు.

రాజకీయ పదవి ప్రజాసేవకు మార్గంగా కాకుండా, పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించుకునే వ్యాపారంగా మారిపోతోంది. ఇప్పటికే ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు సభలకు సక్రమంగా హాజరుకావడం లేదు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొనడం లేదు. బహిష్కరణలు, సభలకు గైర్హాజరు కావడం సాధారణమైపోయాయి. అనేక సందర్భాల్లో సభలో కొద్ది మంది సభ్యులు మాత్రమే కనిపిస్తుండగా, కీలకమైన చట్టాలు మాత్రం ఆమోదం పొందుతున్నాయి.

చాలామంది ప్రజాప్రతినిధులకు ప్రజా సంక్షేమం కంటే వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడం, అధికారిక సదు పాయాలను పొందడం, స్థానికంగా తమ రాజకీయ ఆధిపత్యాన్ని బలోపేతం చేసుకోవడమే ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయ నే విమర్శలు క్షేత్రస్థాయిలో వాస్తవంగా కనపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త గా మరిన్ని స్థానాలను పెంచడం వల్ల జవాబుదారీతనం ఎలా పెరుగుతుంది? పైగా ఈ ప్రయోజనాల కోసం పోటీపడే వారి సంఖ్య మాత్రమే పెరుగుతుందనే అర్థమవుతోంది.

మహిళా రిజర్వేషన్లు స్వాగతించదగినవే, కానీ..

మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం, శాసనసభల్లో మహిళల సంఖ్య ను పెంచడం అనేది సానుకూలమైన ఆలోచన. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం ఉండటం అవసరం. అయితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఎంచుకున్న మార్గంపైనే అభ్యంతరాలు ఉన్నాయి. అదే బలహీనమైన జవాబుదారీతనం, అదే లోపభూయిష్టమైన వ్యవస్థ, అదే హడావుడి చట్టాల ఆమోదం కొనసాగుతున్నప్పుడు పార్లమెంటు సభ్యుల సంఖ్యను పెంచడం వల్ల మెరుగైన పాలన ఎలా సాధ్యమవుతుం ది? బాధ్యత లేని ప్రాతినిధ్యం వల్ల ప్రయోజనం ఏమిటి?

ప్రజలకు కావాల్సింది కేవలం ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కాదు. ప్రజా సంక్షే మం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా వారి ని నిర్బంధించే చట్టబద్ధమైన నిబంధనలు అవసరం. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సభలకు హాజరయ్యేలా హాజరు నిబంధనలు రూపొందించాలి. వాటిని ఉల్లంఘిస్తే కఠినమైన పరిణామాలు ఉండాలి.

వారి ఆస్తులు, వ్యాపార లావాదేవీలపై పూర్తి పారదర్శకత ఉండాలి. ఎన్నికల ఖర్చులపై కఠిన మైన పరిమితులు విధించాలి. ముఖ్యమైన బిల్లులను ప్రజాభిప్రాయ సేకరణతోపాటు, సమగ్ర పరిశీలన కోసం తప్పనిసరిగా పార్లమెంటరీ కమిటీలకు పంపించాలి. ఇలాంటి సంస్కరణలు లేకుండా ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచడం వల్ల వ్యవస్థలో ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత పెరగదు. పైగా వ్యవస్థ నుంచి ప్రయోజనాలు పొందే వారి సంఖ్య మాత్రమే పెరుగుతుంది.

ప్రత్యేక చట్టాలు ముందుగా రావాలి!

డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించి ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్యను పెంచే ముం దు, ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేకమైన కఠిన చట్టా లను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజాప్రతినిధులు తమ పదవులను అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నిరోధించే వ్యవస్థ ఉండాలి.

ఎన్నికల్లో పెట్టిన ఖర్చును తిరిగి సం పాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కాం ట్రాక్టులు, భూములు, ప్రభుత్వ వనరులు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధానాలకు అడ్డుకట్ట వేయాలి. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వారి ఆస్తుల వివరాలను పారదర్శకంగా పరిశీలించే వ్యవస్థను ఏర్పా టు చేయాలి. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రజాప్రతినిధులపై కఠి న చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించాలి.

ప్రజాప్రతినిధుల సంఖ్య పెంచడం కంటే ముందుగా.. ఉన్న ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా పనిచేసేలా చేయడం అత్యంత ముఖ్యం. ఈ ప్రాథమిక సంస్కరణలు అమలు చేయకుండా చేపట్టే డీలిమిటే షన్ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయదు. ప్రజాధనంపై అదనపు భారాన్ని పెంచుతూ, అవినీతికి మరిన్ని సరికొత్త అవకాశాలను కల్పిస్తుంది. కాబట్టి ప్రజాప్రతినిధుల అధికార దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యేక చట్టా లు తీసుకొచ్చిన తర్వాతే ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య పెంపునకు సంబంధించిన డీలి మిటేషన్ ప్రక్రియను చేపట్టాలి.

ప్రజలకు కావాల్సింది ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు కాదు.. ప్రజల కోసం పనిచేసే బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులు!

రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట..

జనాభా ప్రాతిపదికన న్యాయం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అనే పేర్లతో డీలిమిటేషన్‌ను సమర్థిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తగినంత చర్చ లేకుం డానే చట్టాలను ఆమోదించగలమని, సభా సమయాన్ని నిరసనలు, అంతరాయాలతో వృథా చేయగల మని, సంస్థా గత అధికార సమతుల్యతను ప్రభావితం చేసే నిర్ణయాలను కూడా వేగంగా అమ లు చేయగలమని పార్లమెంటు ఇప్పటికే నిరూపించింది. ఇలాంటి వ్యవస్థలో ప్రస్తు త లోపాలను సరిదిద్దకుండా సభ్యుల సంఖ్యను పెంచితే ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయి.

ఎన్నికల సమయంలో అవినీతి మరింత విస్తరిస్తుంది. ప్రజా పదవులను వ్యక్తిగత వ్యాపారాలుగా భావించే వారి సంఖ్య పెరుగుతుంది. జనాభా నియంత్రణ, అభివృద్ధి వంటి అంశాల్లో మెరు గైన పనితీరు కనబరిచిన దక్షిణాది రాష్ట్రా లు, ఇతర రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యంలో తమ ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది.

చివరకు ఈ భా రమంతా ప్రజలపైనే పడుతుంది. పన్నుల రూపంలో ప్రజల డబ్బు ఖర్చవుతుంది. నాణ్యత లేని చట్టాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది. జవాబుదారీతనం మరిం త బలహీనపడు తుంది. నిజమైన సంస్కరణలు అంటే అదనంగా ఏర్పాటయ్యే ప్రతి ప్రజాప్రతినిధి స్థానానికి ప్రజల పట్ల కచ్చితమైన బాధ్యతలు, విధులు, జవాబుదారీతనం ఉండేలా చట్టాలు రూపొందిం చడం. కేవలం మరిన్ని అధికారిక సదుపాయాలు, మరిన్ని ప్రయోజనాలు, ప్రజాధ నాన్ని దుర్వినియోగం చేసుకునే అవకాశాలు కల్పించడం కాదు.

మరిన్ని వార్తలు