సవాళ్ల మెట్రో @ 9
- తొమ్మిదేండ్ల్లలో 94.2 కోట్ల ప్రయాణాలు
- మూడు కోచ్‌లకే పరిమితం.. పీక్ అవర్స్‌లో ప్రయాణికుల అవస్థలు
- రద్దీ వల్ల రోజువారీ ప్రయాణికుల సంఖ్య 5.5 లక్షల నుంచి 4.7 లక్షలకు తగ్గుదల
- రూ.15వేల కోట్ల ఆర్థిక భారం.. సర్కార్‌కు సవాల్
నవంబర్ 28 (విజయక్రాంతి) : నగర ప్రజా రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail) తొమ్మిదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. 2017 నవంబర్ 28న ప్రారంభమైన మెట్రో.. ఇప్పటివరకు 94.2 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం కల్పించడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావడం వంటి అంశాల్లో మెట్రో తనదైన ముద్ర వేసింది. అయితే, ఒకవైపు మైలురాళ్లను దాటుతున్నా, మరోవైపు మెట్రోకు సవాళ్లు ఎదురవుతున్నాయి.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆరు కోచ్‌ల రైళ్లను నడపాలన్న ప్రతిపాదనకు ఇంతవరకు మోక్షం లభించలేదు. ఇప్పటికీ మూడు కోచ్‌లతోనే రైళ్లు నడుస్తుండటంతో పీక్ అవర్స్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైళ్ల మధ్య వ్యవధి, చివరి మైలు కనెక్టివిటీ లోపాలు, కొత్త కారిడార్ల విస్తరణలో జాప్యం మెట్రో వ్యవస్థకు సవాలుగా మారాయి.
మరోవైపు, ఆర్థిక నష్టాల కారణంగా మెట్రో నిర్వ హణ బాధ్యతలను ఎల్అండ్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకునే ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఈ బదిలీతో ప్రభుత్వంపై దాదాపు రూ.15 వేల కోట్ల వరకు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
మెట్రోపై కొత్త బాధ్యత
హైదరాబాద్ మెట్రో ఫేజ్ నిర్వహణ బాధ్యతలను ఎల్అండ్టీ నుంచి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిర్వహ ణలో ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు, భవిష్యత్ విస్తరణ అవసరాలు, ప్రాజెక్టుపై ప్రభు త్వ ప్రత్యక్ష నియంత్రణ వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరిం చుకుంది. 2026 ఏప్రిల్ 29న ఎల్అండ్టీ, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్య 100 శాతం ఈక్విటీ వాటాల కొనుగోలుకు సంబంధించి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదిరింది.
ఈక్విటీ విలువ రూ.1,461.47 కోట్లుగా నిర్ణయించారు. మరోవైపు ఎల్అండ్టీ మెట్రోకు ఉన్న రూ.13,538.53 కోట్ల అప్పును రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో రీఫైనాన్స్ చేయాల్సి ఉంది. అయితే ఒప్పందం కుదరడం, పూర్తిస్థాయిలో ఆర్థిక లావాదేవీలు ముగిసి నిర్వ హణ బదిలీ కావడం రెండూ వేర్వేరు అంశా లు, కాగా ఐఆర్ఎఫ్సీ నుంచి సుమారు రూ.13,600 కోట్ల రుణం విడుదలలో జాప్యం కారణంగా స్వాధీన ప్రక్రియపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై కేంద్రంతో రాష్ట్రం సంప్రదింపులు జరుపుతోంది.
రుణం పొందడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తోంది. తాజా సమాచారం ప్రకారం మెట్రో స్వాధీన ప్రక్రి య గడువును డిసెంబర్ వరకు పొడిగించినట్లు ఎల్అండ్టీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలి యజేసింది. ఎల్అండ్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ప్రాజెక్టుపై ప్రత్యక్ష నియంత్రణ లభిస్తుంది.
ఫేజ్- ఫేజ్ఛీ మధ్య సమన్వయం పెంచ డం, కొత్త మార్గాల నిర్మాణం, అదనపు కోచ్ ల కొనుగోలు, ఆర్టీసీతో అనుసంధానం వం టి నిర్ణయాలను సమగ్రంగా తీసుకునే అవకాశం లభించింది. అయితే రూ.13,538 కోట్లకు పైగా ఉన్న రుణ భారం, వడ్డీ చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు, భవిష్యత్ పెట్టుబ డులు ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయి.
రైళ్ల కోసం పడిగాపులు
సాధారణంగా రద్దీ సమయాల్లో మియాపూర్- రెడ్ లైన్, నాగోల్- దుర్గం బ్లూ లైన్ మార్గాల్లో నాలు గు నిమిషాల వ్యవధితో రైళ్లు నడుస్తున్నాయి. గ్రీన్ లైన్లో ఈ వ్యవధి 12 నిమిషాలుగా ఉంది. రద్దీ లేని సమయాల్లో మార్గాన్ని బట్టి 5 నుంచి 12 నిమిషాల వ్యవధి ఉంటుంది. ము ఖ్యంగా ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం స్టేషన్లో సాయంత్రం వేళ 8 నిమిషాల పాటు రైలు కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు కూడా నమోదవుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
ఇప్పటికే మూడు కోచ్‌లతో నడుస్తున్న రైళ్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోతుండగా, రైళ్ల మధ్య వ్యవధి పెరిగితే సమస్య మరింత తీవ్రమవుతోంది. కేవ లం రైళ్ల సంఖ్య పెంచడమే కాకుండా, రద్దీకి అనుగుణంగా సర్వీసుల నిర్వహణ, సిగ్నలింగ్ సామర్థ్యం, రైళ్ల అందుబాటు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మెట్రోలోని 57 రైళ్లలో ఒక్కో రైలుకు మూడు కోచ్‌లు ఉన్నాయి. నగర జనాభా, ఐటీ ఉద్యోగుల సంఖ్య, ప్రయాణికుల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సామర్థ్యం సరిపోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నాలుగు, ఆరు కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను మెట్రో అధికారులు పరిశీలించారు. అదనం గా 40 నుంచి 60 కోచ్‌ల కొనుగోలుకు ప్రణాళికలు రూపొందించారు. 60 అదనపు కోచ్‌ల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించినట్లు సమాచారం. కొత్త కోచ్‌లు అందు బాటులోకి వస్తే రద్దీని తగ్గించడంతో పాటు ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే ఆరు కోచ్‌లు అం దుబాటులోకి రావడానికి కనీసం రెండేళ్ల సమయం పట్టవచ్చన్న అంచనాలు ప్రయాణికుల్లో నిరీక్షణను పెంచుతున్నాయి.
ఫేజ్ అత్యంత కీలకం
ఒకప్పుడు రోజుకు 5.5 లక్షల మంది ప్రయాణించిన మెట్రోలో ప్రస్తుతం రోజువారీ ప్రయాణికుల సంఖ్య సుమారు 4.7 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు 80 వేల మంది తగ్గారు. కరోనా తర్వాత ప్రయా ణ విధానాల్లో వచ్చిన మార్పులు, వర్క్ ఫ్రమ్ హోమ్, చివరి మైలు కనెక్టివిటీ లోపా లు, ఇతర రవాణా మార్గాల వినియోగం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా మెట్రో స్టేషన్‌కు చేరుకో వడానికి, అక్కడి నుంచి గమ్యస్థానానికి వెళ్లడానికి ప్రయాణికులు పడుతున్న ఇబ్బం దులు మెట్రో వినియోగంపై ప్రభావం చూ పుతున్నాయి.
మెట్రో స్టేషన్లకు ఆర్టీసీ ఫీడర్ బస్సులు, షటిల్ సర్వీసులు, ఆటో సదుపాయాలు, పాదచారుల మార్గాలు సమర్థంగా అనుసంధానం కావాల్సి ఉంది. మెట్రో కామన్ పాస్ ప్రవేశపెట్టడం మంచి పరిణామమే అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో చివరి మైలు రవాణా మెరుగుపడితేనే ఎక్కు వ మంది ప్రయాణికులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ విస్తరణకు అనుగుణంగా మెట్రో నెట్‌వర్క్స్‌ను పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదిత ఫేజ్- 2లో కొత్త కారిడార్ల ద్వారా నగరంలోని మరిన్ని ప్రాంతాలను అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే కేంద్ర అనుమతులు, నిధుల సమీకరణ, ప్రా జెక్టు ఆర్థిక నమూనా వంటి అంశాలు కీలకంగా మారాయి. ఫేజ్- స్వాధీన ప్రక్రియ లో జాప్యం కూడా భవిష్యత్ విస్తరణపై ప్రభావం చూపుతోంది. మరోవైపు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల ఓల్ సిటీ మెట్రో కారిడార్‌పై స్థా నికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆస్తుల సేకరణ 95 శాతం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్గం పూర్తయితే పాతబస్తీ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వాణిజ్య, పర్యాటక కార్యకలాపాలకు కూడా ఊతం.
ప్రభుత్వానికి అసలైన పరీక్ష
సమస్యలు ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణలో హైదరాబాద్ మెట్రో విజయాలూ సాధించింది. ఇప్పటివరకు 629 మిలియన్ కిలోల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలను నివారించినట్లు మెట్రో వెల్లడించింది. 12.4 మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మొత్తం విద్యుత్ అవసరాల్లో 15 శాతాన్ని సమకూర్చుకుంటోంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ ద్వారా ట్రాక్షన్ విద్యుత్ అవసరాల్లో 40 శాతాన్ని తిరిగి పొందుతోంది. రైళ్ల సమయపాలన, సేవల విశ్వసనీయతలో 99.9 శాతం స్థాయిని కొనసాగిస్తున్నట్లు సంస్థ చెబుతోంది.
తొమ్మిదేళ్లలో హైదరాబాద్ మెట్రో నగర ప్రజా రవాణాలో తనదైన స్థానం సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఎల్అండ్టీ నుంచి బాధ్యతలు తీసుకోవడం, భారీ రుణభారాన్ని నిర్వహించడం, కొత్త కోచ్‌లను కొనుగోలు చేయడం, రైళ్ల మధ్య వ్యవధిని తగ్గించడం, ఫేజ్- పట్టాలెక్కించడం వంటి అనేక సవాళ్లు ప్రభుత్వ ముందున్నాయి.