చెరువులో పడి వ్యక్తి మృతి
22-11-2026 | 11:42am
చేగుంట నవంబర్ 22,విజయక్రాంతి: చేగుంట మండలంలోని చందాయిపేట గ్రామ లొ గల దేవుని చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చేట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన పసుల ఆంజనేయులు (58)శనివారం రాత్రి సమయంలో చేపలు పట్టేందుకు వల తీసుకొని దేవుని చెరువులోకి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోవడంతో నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలిపారు.