ఉద్యోగ ప్రయత్నాలు.. అంతలోనే విషాదం

23-10-2026 | 06:42pm

ఖమ్మం: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ యువతి అకాల మరణం(Telangana Student Death) ఆమె కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఖమ్మం జిల్లాకు చెందిన నల్లమల అక్షిత(Nallamala Akshitha) న్యూయార్క్‌(New York)లో గుండెపోటుతో మృతి చెందినట్లు సమాచారం.

అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన అక్షిత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఉన్నత చదువులు పూర్తి చేసి, మంచి ఉద్యోగంతో జీవితంలో స్థిరపడుతుందని ఆశించిన తల్లిదండ్రులకు ఆమె మరణవార్త తీరని వేదనను మిగిల్చింది.

కూతురు ఉన్నత చదువులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుందని ఎదురుచూస్తున్న కుటుంబానికి ఈ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. తమ బిడ్డ ఇక తిరిగి రాదనే నిజాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అక్షిత మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. విదేశాల్లో చదువుకుని భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతి ఇలా అకాలంగా కన్నుమూయడం స్థానికంగా విషాదాన్ని నింపింది.

మరిన్ని వార్తలు