92 ఏళ్ల వయసులో Arrest
దశాబ్దాల నాటి మర్డర్ మిస్టరీ.. చివరికి చిక్కిన తల్లి!
వాషింగ్టన్: అమెరికాలో 57 ఏళ్ల క్రితం జరిగిన ఓ చిన్నారి హత్యోదంతం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ఐదేళ్ల కన్నకొడుకును సుమారు నాలుగేళ్ల పాటు తీవ్రంగా హింసించి, అతడి మరణానికి కారణమైందనే ఆరోపణలతో 92 ఏళ్ల వృద్ధురాలిని టెక్సాస్ పోలీసులు Arrest చేశారు. దశాబ్దాలుగా మిస్టరీగా ఉన్న ఈ Cold Caseలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. హ్యారియట్ ఎవిలిన్ హాల్ (92) 1969లో టెక్సాస్‌లోని యూనివర్సల్ సిటీలో నివసించేది. ఆ సమయంలో తన ఐదేళ్ల కుమారుడిని సుమారు నాలుగేళ్ల పాటు తీవ్రంగా హింసించినట్లు ఆమెపై Allegations ఉన్నాయి. ఈ క్రమంలో బాలుడు కోమాలోకి వెళ్లి, 1969 నవంబర్ 25న మరణించాడు. అప్పట్లో హ్యారియట్ భర్త జేమ్స్ ఫ్లెచర్ హాల్ రాండోల్ఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో పనిచేసేవారు. ఆయన ఇప్పటికే మరణించారు. దశాబ్దాలుగా ఈ Murder Caseకు సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే మృతుడి సోదరుడు జేమ్స్ రాండాల్ హాల్ ఈ కేసులో కీలక సాక్షిగా మారాడు. తన సోదరుడిపై జరిగిన హింసను చిన్నతనంలోనే కళ్లారా చూశానని చెబుతూ, 2024లో పోలీసులకు కీలక Statement ఇచ్చాడు. దీంతో అధికారులు పాత కేసు ఫైళ్లను తిరిగి పరిశీలించి Investigation ప్రారంభించారు.
ఈ క్రమంలో వాకో నగరంలో నివసిస్తున్న హ్యారియట్ను పోలీసులు విచారించారు. విచారణలో ఆమె ఇచ్చిన సమాధానాలు పొంతనలేకుండా ఉన్నట్లు సమాచారం. గతంలో బాలుడు ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడని చెప్పిన ఆమె, ఆ తర్వాత ఆ ఘటన గురించి తనకు ఏమీ గుర్తులేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ విభిన్న సమాధానాలు పోలీసుల అనుమానాలను మరింత పెంచాయి. సోదరుడు అందించిన సమాచారం, పాత Police Records ఆధారంగా అధికారులు హ్యారియట్ను బెక్సార్ కౌంటీలో అరెస్ట్ చేశారు. ఆమెకు 5 లక్షల డాలర్ల Bail Bond విధించారు. పోలీసులు విడుదల చేసిన Mugshotలో ఆమె ఆరెంజ్ రంగు జంప్‌సూట్ ధరించి, మెడకు బ్రేస్‌తో కనిపించింది.
ఇదిలా ఉండగా.. అమెరికాలో ఇటీవల మరో చిన్నారి మృతి ఘటన కలకలం రేపింది. మిసిసిపీలో బిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే ఆ శిశువును కొట్టి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 25 ఏళ్ల జానెల్ షారన్ జోర్డాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. Postmortem Reportలో శిశువు తలపై బలమైన గాయాలే మరణానికి కారణమని తేలడంతో పోలీసులు ఆమెను విచారించి అదుపులోకి తీసుకున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ Crime Cases అమెరికాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.