దక్షిణాదిలో ష్నైడర్ ఎలక్ట్రిక్ ‘సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్’

24-10-2026 | 05:43pm

బెంగళూరు: పారిశ్రామిక రంగం(Industrial Sector)లో ఎలక్ట్రికల్ నిర్వహణను మరింత ఆధునికంగా మార్చే లక్ష్యంతో గ్లోబల్ ఎనర్జీ టెక్నాలజీ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్(Schneider Electric) దక్షిణ భారతదేశంలో ‘సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్’(Services Express) కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొబైల్ సర్వీస్ ఇన్నోవేషన్ హబ్‌గా రూపొందించిన ఈ కార్యక్రమం ద్వారా ఐదు రాష్ట్రాల్లోని 20కి పైగా నగరాలకు తన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సేవలను తీసుకెళ్లనుంది. 120 రోజులకు పైగా కొనసాగే ఈ యాత్ర బెంగళూరులో ప్రారంభమైంది.

ఏఐ ఆధారిత నిర్వహణ పరిష్కారాల ప్రదర్శన

సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా కీలకమైన ఎలక్ట్రికల్ పరికరాల పర్యవేక్షణకు ఉపయోగపడే ఏఐ ఆధారిత మానిటరింగ్(AI-based monitoring), కండిషన్-బేస్డ్ మెయింటెనెన్స్, పరికరాల జీవితకాల నిర్వహణకు సంబంధించిన ఆధునిక పరిష్కారాలను ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నారు. ఈ సాంకేతికతల ద్వారా పరికరాల పనితీరును ముందుగానే అంచనా వేయడం, నిర్వహణ అవసరాలను గుర్తించడం, అనుకోని సాంకేతిక అంతరాయాలను తగ్గించే అవకాశాలను పరిశ్రమలకు పరిచయం చేయనున్నారు.

పరిశ్రమలకు చేరువగా సాంకేతిక సేవలు

డేటా సెంటర్లు, పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య భవనాలు, విద్యుత్ గ్రిడ్‌లు తదితర కీలక రంగాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మొబైల్ హబ్‌ను రూపొందించారు. ఎలక్ట్రికల్ పరికరాలను వాటి జీవితకాలం పొడవునా నిర్వహించడం, ఆధునీకరించడం, పనితీరును మెరుగుపరచడం వంటి అంశాల్లో సంస్థలకు అవగాహన కల్పించనుంది.

ఈ కార్యక్రమం ద్వారా పారిశ్రామిక క్లస్టర్లకు నేరుగా చేరుకుని, ఆయా సంస్థల నిర్వహణ వాతావరణానికి అనుగుణంగా సాంకేతిక పరిష్కారాలను వివరించే అవకాశం కలుగుతుంది. ప్రత్యక్ష ప్రదర్శనలతో పాటు ష్నైడర్ ఎలక్ట్రిక్ సేవా నిపుణులతో చర్చించే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఐదు రాష్ట్రాల్లో పర్యటన

ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ దామిని చౌదరి మాట్లాడుతూ, వాస్తవ పారిశ్రామిక పరిస్థితుల్లో తమ సేవల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు సర్వీసెస్ ఎక్స్‌ప్రెస్ ఉపయోగపడుతుందని తెలిపారు. డిజిటల్ మానిటరింగ్, కండిషన్-బేస్డ్ మెయింటెనెన్స్, లైఫ్‌సైకిల్ సేవలను సమన్వయం చేయడం ద్వారా పరికరాల విశ్వసనీయతను పెంచడం, అనుకోని అంతరాయాలను తగ్గించడం వంటి ప్రయోజనాలపై సంస్థలకు అవగాహన కల్పించడమే లక్ష్యమని వివరించారు.


కర్ణాటక, కేరళ, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించే ఈ మొబైల్ హబ్ ద్వారా దక్షిణాదిలోని కీలక పారిశ్రామిక మార్కెట్లకు ష్నైడర్ ఎలక్ట్రిక్ సేవలు మరింత చేరువ కానున్నాయి. డిజిటల్ సాంకేతికత, ముందస్తు నిర్వహణ, పరికరాల జీవితకాల ఆప్టిమైజేషన్‌పై దృష్టి సారిస్తూ పరిశ్రమలకు ఆధునిక పరిష్కారాలను పరిచయం చేయనుంది.

మరిన్ని వార్తలు