బచ్చన్నపేటలో కోతుల స్వైర విహారం
పోలీస్ స్టేషన్ ముందే గుంపుగా దాడి, భయాందోళనలో ప్రజలు
జనగామ,(బచ్చన్నపేట) అక్టోబర్ 24 (విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) బచ్చన్నపేట మండల కేంద్రంలో కోతుల బెడద(Monkey Menace) తీవ్రమైంది. శనివారం ఏకంగా పోలీస్ స్టేషన్(Police Station) ఎదుటే కోతులు మందగా గుంపుగా రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రోజురోజుకు కోతుల దాడులు పెరిగిపోతున్నాయని, పిల్లలు, వృద్ధులు బయట తిరగలేకపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తున్నాయని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతులను పట్టుకొని అటవీ ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.