జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్
కొత్త ఏడాదికి ముందే రిలయన్స్ జియో తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2027’ పేరుతో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తోంది. వీటితో పాటు తక్కువ ధరలోనే అదనపు 5G డేటా పొందేలా ప్రత్యేక యాడ్-ఆన్ ప్యాక్‌లను కూడా తీసుకొచ్చింది. రూ.399 నుంచి ప్రారంభమయ్యే ఈ ఆఫర్లలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
రూ.399 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ
జియో తీసుకొచ్చిన రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ 4G, 5G డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయాలు ఉన్నాయి. రోజుకు 100 SMSలు కూడా పంపుకోవచ్చు.
అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే 12 నెలల Canva Pro సబ్స్క్రిప్షన్, JioHotstar Mobile+ Hollywood, JioGames Mobile, FanCode, JioTV సేవలు లభిస్తాయి. వీటితో పాటు 50GB JioAICloud స్టోరేజ్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఏడాది పాటు డేటా.. రూ.3,999 రీఛార్జ్
తరచూ రీఛార్జ్ చేసుకునే అవసరం లేకుండా ఏడాది మొత్తం ఒకే ప్లాన్‌తో కొనసాగాలనుకునేవారికి రూ.3,999 ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు అన్లిమిటెడ్ 4G, 5G డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు.
ఇక అదనపు బెనిఫిట్స్‌లో భాగంగా 12 నెలల Canva Pro Lite, JioHotstar Mobile+ Hollywood, FanCode, JioTV సబ్స్క్రిప్షన్లు, 50GB JioAICloud స్టోరేజ్ లభిస్తాయి. రూ.15, రూ.25తో అన్లిమిటెడ్ 5G, ఎక్కువ డేటా అవసరమయ్యే వారి కోసం జియో రెండు ప్రత్యేక డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లను అందిస్తోంది.
రూ.15 ప్యాక్: ఒక రోజు పాటు అన్లిమిటెడ్ 5G డేటా. రూ.25 ప్యాక్: రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ 5G డేటా. తక్కువ వ్యవధిలో ఎక్కువ డేటా వినియోగించాలనుకునే వారికి ఈ ప్యాక్‌లు ఉపయోగపడతాయి. రూ.50కే ఐదు గంటల నైట్ డేటా
జియో మరో ప్రత్యేక ఆఫర్‌ను కూడా తీసుకొచ్చింది. రూ.50 నైట్ డేటా ప్యాక్‌తో ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్లిమిటెడ్ 4G, 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు. రాత్రివేళ సినిమాలు, వీడియోలు డౌన్లోడ్ చేసుకునేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.