భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

19-09-2026 | 10:34am

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శనివారం నాడు బంగారం(Hyderabad Gold Price), వెండి ధరలు రికార్డు స్థాయిలో ఎగబాకాయియూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను(US Federal Reserve interest rates) పెంచడంతో రెండు రోజులకు ముందు తగ్గిన పసిడి ధరలు(Gold Price) మళ్లీ పెరుగుతున్నాయి. నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,420 పెరిగి రూ. 1,55, 840 చేరుకుంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(22-carat gold) రూ.1,300 పెరిగి 1,42,850 పలుకుతోంది. అటు వెండి ధర(Silver price) ఏకంగా రూ. 5000 పెరిగిపోవడంతో కేజీ వెండి రూ. 2,60,000 చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలు, జీఎస్టీ రేట్లను బట్టి బంగారం, వెండి కొనుగోళ్లలో స్వల్ప తేడాలు ఉంటాయి.

మెట్రో నగరాల్లో బంగారం ధరలు (ప్రతి 10 గ్రాములకు)

ఢిల్లీ 22K Gold రూ.1,41,700,  24K Gold రూ.1,54,570

ముంబై 22K Gold రూ.1,41,700, 24K Gold రూ.1,54,580

కోల్‌కతా 22K Gold రూ.1,41,108,  24K Gold రూ.1,53,936

చెన్నై 22K Gold రూ.1,41,560, 24K Gold రూ.1,54,430



మరిన్ని వార్తలు