కలలకు భరోసా.. భవిష్యత్తుకు బీమా!

14-11-2026 | 05:10am

ముంబై: జెనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్(Generali Central Life Insurance) కంపెనీ లిమిటెడ్ (జిసిఎల్ఐ), భారత్‌ పై దృష్టి సారించిన సమీకృత మీడియా వ్యూహంతో, తన జాతీయ బ్రాండ్ ప్రచారమైన 'హియర్.నౌ.' తాలూకు తాజా అధ్యాయాన్ని ప్రారంభించింది. పిల్లల భవిష్యత్ ప్రణాళిక, పదవీ విరమణ సన్నద్ధత పై దృష్టినిలపడాన్ని కొనసాగిస్తూ, ఈ ప్రచారం బ్రాండ్ తాలూకు 'మీ నిర్భయ కలల కోసం పెద్దగా ఆలోచించండి' అనే తత్వాన్ని సజీవంగా నిలుపుతుంది.

జీవితంలో ప్రతి దశలోనూ పెద్ద కలలు కనడానికి, ఆకాంక్షలను సాకారం చేసుకోవడానికి ఇది వినియోగదారులని ప్రేరేపిస్తుంది. పెరుగుతున్న విద్యా ఖర్చులు తల్లిదండ్రులను ముందుగానే ప్రణాళికలు వేసుకునేలా హెచ్చరిస్తున్నప్పుడు, పెరుగుతున్న ఆయుర్దాయం పదవీ విరమణ అవసరాలను పునర్నిర్వచిస్తుప్పుడు, మనం ఊహించుకున్న భవిష్యత్తు కోసం ఈరోజే చర్యలు తీసుకోవలసిన ప్రాముఖ్యతను ఈ ప్రచారం నొక్కి చెబుతోంది.

జీవిత అనూహ్యతల్లోకూడా దీర్ఘకాల ఆకాంక్షలకు కొనసాగింపు అవసరమన్న విషయాన్ని గురిస్తూ, చెల్లుబాటయ్యే బేస్ ప్లాన్స్ పై ప్రీమియం రైడర్ ని మాఫీ చేయడాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది. దీర్ఘకాలిక ప్రణాళికలకు మరింత కొనసాగింపుని జోడించేందుకు రూపుదిద్దిన ఈ రైడర్ మాఫీ, రైడర్ నిబంధనలు, షరతులు, మినహాయింపులు, అర్హత అవసరాల క్రింద పేర్కొన్న విధంగా వాటిల్లో కవర్ అయ్యే ఆకస్మిక సంఘనల సంభవించినప్పుడు భవిష్యత్ ప్రీమియంలను మాఫీ చేస్తుంది, అదే సమయంలో పాలసీ ప్రయోజనాలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయి.

ప్యూర్-రిస్క్ ప్రీమియం రైడర్‌గా అందుబాటులో ఉన్న దీని ద్వారా, ప్రమాదవశాత్తు సంపూర్ణ, ఇంకా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు, కవరయ్యే తీవ్ర అనారోగ్యాలు నిర్ధారణ అయినప్పుడు, వర్తించే చోట, పాలసీదారు మరణించిన సందర్భంలో భవిష్యత్ ప్రీమియంల మాఫీని వినియోగదారులు ఎంచుకోవచ్చు. జీవితంలోని కీలక దశలలో వినియోగదారులకు మద్దతు ఇవ్వడానికి, కంపెనీ పోర్టుఫోలియోలో పిల్లల భవిష్యత్ ప్రణాళిక కోసం రూపొందించిన జీవిత బీమా పరిష్కారాలు ఉన్నాయి. 

జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండి & సిఇఒ అలోక్ రుంగ్తా, ఈ ప్రచారం సంకల్పాన్ని ఆచరణలోకి మార్చే విషయం పై దృష్టి సారించడం గురించి వ్యాఖ్యానిస్తూ, “భారతీయ కుటుంబాలకు పిల్లల భవిష్యత్తుకు ప్రణాళిక, పదవీ విరమణ సన్నద్ధత అనే రెండు అత్యంత ముఖ్యమైన ఆర్థిక ప్రాధాన్యతలు ఉన్నాయి.

ఊహించని పరిస్థితులలో కూడా ఆర్థిక ప్రణాళికల కొనసాగింపును నిర్ధారించడంలో సహాయపడటం ద్వారా, ప్రీమియం రైడర్ మాఫీ అనేది మా ప్రతిపాదనను మరింత బలోపేతం చేస్తుంది. మా ఇటీవలి చొరవతో, వినియోగదారులను వారి భవిష్యత్తు వైపు ఒక అర్థవంతమైన అడుగు వేయమని ప్రోత్సహిస్తూనే, ఒక విశ్వసనీయ జీవితకాల భాగస్వామిగా ఉండే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నామన్నారు

మరిన్ని వార్తలు