పట్టభద్రుల ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రం...
స్టేట్ అబ్జర్వర్ సయ్యద్ ఇస్మాయిల్
కొత్తగూడెం, ఆక్టోబరు 27 (విజయక్రాంతి): పట్టభద్రుల ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ తెలంగాణ స్టేట్ అబ్జర్వర్ సయ్యద్ ఇస్మాయిల్(State Observer Syed Ismail) అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని శ్రీ కృష్ణ ఇన్ హోటర్ వద్ద తెలంగాణ రక్షన సేన(టీ.ఆర్.ఎస్) ఆధ్వర్యంలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కేంద్రాన్ని భద్రాద్రి జిల్లా అధ్యక్షులు సముద్రాల క్రాంతి కుమార్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి, ఎమ్మెల్సీ ఓటరు నమోదు చేసి ఆ నకలు కాపీని అభ్యర్థికి అందజేశారు.
ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడుతూ, నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల తెలంగాణ రక్షన సేన పార్టీ అభ్యర్థి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ,ప్రజాస్వామ్య బలోపేతానికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
నమోదు ప్రక్రియను విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవంబర్ 6న ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ఆఖరి గడువు, కావున ప్రతీ గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకొని, ఓటు వినియోగించుకొని అత్యధిక మెజారిటీతో టీ.ఆర్.ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి సయ్యద్ ఇస్మాయిల్, ఖమ్మం ఎంపీ ఇన్చార్జ్ అనిత చౌదరి, సోడియం వెంకట్ పినపాక ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జి, వాసం రామకృష్ణ దొర పినపాక నియోజకవర్గం ఇన్చార్జి, గణేష్ మహిళా నాయకులు కొత్తగూడెం గాయత్రి, సురేష్, సీతా తదితరులు పాల్గొన్నారు.