మూఢనమ్మకాలను విశ్వసించవద్దు

27-10-2026 | 09:03pm

బోథ్. అక్టోబర్ 27 (. విజయక్రాంతి) ఆదివాసి మారుమూల గిరిజన గ్రామాలు(Tribal villages) ప్రజలకు వైద్య సదుపాయం(Medical facility) కల్పించాలని లక్ష్యంతో సోనాల మండలంలోనికేశవ్ గూడ, వజ్జర్ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పి అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం నిర్వహించిన వైద్య శిబిరంలో 100 మంది ఆదివాసులకు వైద్య సేవలు చేయించడం జరిగింది.

గ్రామానికి చేరుకున్న ఎస్పి గ్రామస్తులు ఆదివాసి సాంప్రదాయంగా ఆహ్వానించారు. అనంతరం ఎస్పీ గ్రామంలో ఉన్న హనుమాన్ విగ్రహానికి పూలమాలలు వేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మూఢనమ్మకాల బారిన పడి వ్యాధులు తెచ్చుకోవద్దని సూచించారు.కాగా ఈ సందర్భంగా గ్రామస్తులు ఎస్పీ దృష్టికి బోరు సమస్యతో పాటు పాఠశాల భవన సమస్య యువతకు డ్రైవింగ్ లైసెన్స్ లు మంజూరు చేయించాలని కోరారు అంతేగాక రక్తహీనత సమస్యపై పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆదివాసీల సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ఎస్పీ గ్రామస్తులు వివరించారు. గ్రామ యువతులు క్రీడ నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు త్వరలో మండల స్థాయి క్రీడ పోటీల నిర్వహిస్తామన్నారు. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయం అందించాలని వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అంతేగాక ఆరోగ్యం పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు.

అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లేదా ప్రైవేట్ వైద్యులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధచూపించాలని తల్లిదండ్రులకు సూచించారు. లక్ష్యంతో చదివి ఉన్నతులుగా ఎదగాలని యువత దుర్వేసనలకు దూరంగా ఉండాలన్నారు. పెయిన్ కిల్లర్ తెలిపారు. గంజాయి సాగు విరియోగం రమణ నేరమని ఇలాంటి కార్యకర్తలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి సాగు దూరంగా ఉండాలని సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

రోడ్డు భద్రత నియమాలు అవగాహన కలిగి ఉండాలని ధరించాలని సూచించారు. గ్రామాల సమస్యల పరిష్కారానికి పోలీసులతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐ గురుస్వామి, ఎస్సై వి. పురుషోత్తం, గ్రామ సర్పంచ్ కిషన్ పటేల్ ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మితిలేష్,నర్సింగ్ అధికారి శ్రీధర్ ,ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు