దళారులను నమ్మి మోసపోయిన రైతు
20-09-2026 | 02:46pm
దమ్మపేట, సెప్టెంబర్ 20(విజయ క్రాంతి): దమ్మపేట గ్రామానికి చెందిన ఒక రైతు దళారులను నమ్మి మోసపోయిన సంఘటన చోటుచేసుకుంది. దమ్మపేట ఎస్ ఐ బి రాజేష్ కుమార్(SIB Rajesh Kumar) తెలిపిన వివరాల ప్రకారం దమ్మపేట గ్రామానికి చెందిన రైతు తన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు చేయిస్తానని చెప్పడంతో విడతల వారీగా ఐదు లక్షల అరవై వేలు రూపాయలు కొత్తపల్లి సురేష్, బొంతల శంకర్ లకు చెల్లించానని, రోజు గడుస్తున్నా పాసు పుస్తకాలు మంజూరు కాకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్ లో కొత్తపల్లి సురేష్, బొంతల శంకర్ ల పై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.