పంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ అధ్యక్షుడిగా సత్యం

27-10-2026 | 06:39pm

ములకలపల్లి,అక్టోబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేషన్(Telangana Grama Panchayat Employees Union Association) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా దొంతుల సత్యం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.హైదరాబాదులోని రాష్ట్ర కార్యాలయంలో ఈనెల 26న  తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యునైటెడ్ అసోసియేషన్ (కారోబార్,బిల్ కలెక్టర్,పంప్ ఆపరేటర్,ఎలక్ట్రిషన్,గుమస్తా, సఫాయి)సమావేశం జరిగింది.ఆ సమావేశ వివరాలను ఆయన మంగళవారం ఇక్కడ తెలిపారు.

ఈ సమావేశంలో దొంతుల సత్యంను( ములకలపల్లి మండలం) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రాష్ట్ర అధ్యక్షులుగా సాధుల శ్రీకాంత్, రాష్ట్ర కార్యదర్శిగా సత్తు వెంకన్న, గౌరవ అధ్యక్షులుగా ఇంద్రవల్లి వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పనిచేసే 50వేల మంది ఉద్యోగులకు ఎటువంటి సమస్యలు వచ్చిన వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు.

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దొంతుల సత్యం మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఉద్యోగులపట్ల ఎవరైనా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు