సాయిబాబా గుడిలో పూజలు, అన్నదానం
01-10-2026 | 08:18pm
కోదాడ అక్టోబర్ 1 (విజయ క్రాంతి): కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామంలో(Nallabandagudem village) షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు పూజల్లో పాల్గొనేందుకు బారులుతీరారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నల్లపాటి నర్సింహారావు, అర్చకుడు సాయి శర్మ, భక్తులు పాల్గొన్నారు.