వేసవి తాగునీటికి ముందస్తు చర్యలు
* దుమ్ముగూడెం ఆనకట్టపై టీఎంసీ నీటి నిల్వే లక్ష్యం: మంత్రి తుమ్మల
అశ్వాపురం, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి(Drinking water scarcity) తలెత్తకుండా గోదావరి జలాలను(Godavari waters) సమర్థంగా వినియోగించుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) అధికారులను ఆదేశించారు. ఆదివారం అమ్మగారిపల్లి పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో(Bhadrachalam Sub-Collector Mrinal Shrestha) కలిసి పరిశీలించారు. పడవలో ప్రయాణించి ఇసుక బస్తాల ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. ఆనకట్టపై మీటరు ఎత్తున సుమారు లక్షన్నర ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
రోజుకు 10 నుంచి 15 వేల బస్తాలు ఏర్పాటు చేసేలా పనులు వేగవంతం చేయాలన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని, రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచించారు. తుమ్మలచెరువు, సింగభూపాలం, అన్నదైవం, మూకమామిడి చెరువులను నింపడంతో పాటు వైరా, లంకసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెంచాలని ఆదేశించారు. ఉపాధి హామీ ద్వారా కాలువల మరమ్మతులు, చెరువుల పూడికతీత చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ, సర్పంచ్ కవిత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.