యువతకు ఆదర్శం "భద్రాద్రి కా మహారాజ్"
భద్రాద్రి కా మహారాజ్ గణపయ్యను దర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
భద్రాచలం,(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం పట్టణంలోని డా"ఆర్ నాగేశ్వరరావు వీధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భద్రాద్రి, మహారాజ్ గణపతి నవరాత్రుల్లో భాగంగా బుధవారం రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే వెంకటరావు బుధవారం భద్రాద్రి కా మహారాజ్ గణపయ్యను దర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో నవరాత్రులు నిర్వహిస్తున్న భద్రాద్రి కా మహారాజ్ బాధ్యులు కుప్పాల వంశీ తేజని, శ్రీమంతుల బాల సూర్య నీ మరియు కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. నవరాత్రి లే కాకుండా కార్తీకమాసంలో ఘనంగా నిర్వహిస్తున్న అయ్యప్ప 18 మెట్ల పడిపూజ కార్యక్రమాలు, ముక్కోటి ఉత్సవాల్లో అధికారులకు సహకారాలు అందించడం నిజంగా అభినందించాల్సిన విషయం అని ఆయన అన్నారు.