గంభీరావుపేట సింగిల్ విండో చైర్మన్గా వేషాల వెంకటి నియామకం
సొసైటీ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకెళ్తాం: నూతన చైర్మన్ వెంకటి
గంభీరావుపేట సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గంభీరావుపేట సింగిల్ విండో కో-ఆపరేటివ్ సొసైటీ(Gambhiraopet Single Window Co-operative Society) చైర్మన్గా వేషాల వెంకటి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా భూమక్క బాలరాములు, డైరెక్టర్లుగా మోతే రమేష్, కుంట సత్తయ్య, బలగం బాలరాజు గౌడ్, దండవేని అఖిల, ముచ్చ ఆనందం, చెరుకూరి మహేష్, అజ్మీరా భాస్కర్, దోసల యాదమ్మ, ముత్యాల మల్లారెడ్డి, గూని బుచ్చయ్య, గుడికాడి బాలయ్య లు నియమితులయ్యారు. నూతన చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు,సహకార సంఘం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వెంకటి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చైర్మన్గా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా, సొసైటీ అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని, సహకార సంఘం సేవలను మరింత వేగవంతం చేస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు హమీద్, నాయకులు కోమిరిశెట్టి తిరుపతి ఒరగంటి నర్సింలు, రాజానర్సింహ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు.